CSKను ధోని గెలిపిస్తే…నేను విజయ్ ని గెలిపిస్తా అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇవాళ విజయ్ పార్టీ కార్యక్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. నాకంటే ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఎక్కువ అని తెలిపారు. కానీ వచ్చే ఎన్నికలలో టీవికే పార్టీనీ గెలిపించి ధోనీ కంటే ఎక్కవ క్రేజ్ ను తమిళనాడులో నేను సంపాదిస్తానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోని గెలిపిస్తే…నేను విజయ్ అద్వర్యంలో టివికే పార్టీనీ గెలిపిస్తానని పేర్కొన్నారు. వచ్చే వందరోజుల్లో టీవీకే పార్టీ పది ఇంతలు పటిష్టంగా కార్యకర్తలు మార్చాలని కోరారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కాగా.. విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి వ్యుహకర్తగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి, కమ్యూనిజం, కుటుంబ పాలనా తమిళనాడులో పోవాలని కోరడం జరిగింది పీకే.