సినీ ప్రియులందరికీ మాట ఇస్తున్నా.. జై హనుమాన్ పై ప్రశాంత్ వర్మ పోస్ట్..!

-

హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పెద్ద హిట్ని కొట్టేశారు. నెక్స్ట్ జై హనుమాన్ సినిమాతో రాబోతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రియులకి మాట ఇచ్చారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియలకి నేను మాట ఇస్తున్నాను. జీవితాంతం గుర్తు పెట్టుకునేలా జై హనుమాన్ తో అద్భుతమైన అనుభూతిని అందిస్తానని మనందరికీ సినిమా ఎంతో ప్రత్యేకంగా కాబోతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ప్రశాంత్ వర్మ ఈ మేరకు శ్రీరాముడికి హనుమంతుడు మాట ఇస్తున్నట్లుగా ఉన్న ఒక స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశారు. ప్రస్తుతం సినీప్రియుల దృష్టిని ఈ పోస్టు ఆకర్షిస్తోంది. తేజ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరమీదకు తీసుకువచ్చారు. హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పెద్ద హిట్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news