బిగ్ బ్రేకింగ్: ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండను: ప్రశాంత్ కిషోర్

తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండేది లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసారు. తాను ఇక నుంచి ఏ పార్టీ కోసం పని చేయను అని ఆయన అధికారికంగా ప్రకటన చేసారు. బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం తమిళనాడులో స్టాలిన్ కోసం ఆయన పని చేసారు. బిజెపిని వీరు సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఆయన తన వంతుగా కృషి చేసారు.

కాని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ ప్రకటన చేయడంతో అందరూ షాక్ అయ్యారు. తన భవిష్యత్తు కి సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రశాంత్ దెబ్బకు బెంగాల్ లో బిజెపికి 80 స్థానాలు కూడా రాలేదు. మమతా బెనర్జీ 202 స్థానాలతో తిరిగి మూడో సారి అధికారంలోకి వచ్చారు.