జగన్ ఏపీకి సీఎం కాగానే పాలన పరమైన ప్రక్షాళన ప్రారంభించే క్రమంలో భాగంగా… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభలో ఆమోదించారు. ఈ క్రమంలో బలమున్న శాసనసభలో నెగ్గుకొచ్చినా… బలంలేని శాసనమండలిలో ఈ బిల్లులకు టీడీపీ అడ్డుపుల్ల వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాసనమండలిలో బిల్లు పెట్టి నెలరోజులు గడవడంతో నిబంధనల ప్రకారం బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది!
ఈ క్రమంలో గవర్నర్ వద్దే అంతా అయిపోతుంది.. ఇక బట్టలు సర్ధుకోవడమే ఆలస్యం.. అన్న స్థాయిలో విశాఖ వాసులతో పాటు ఏపీలో మెజరిటీ ప్రజలు కలలు కన్నారు. ఇప్పుడు గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించి.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు! ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ రెండు బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖలు రాశాయి.. రాష్ట్రపతిని కూడా కలిశాయి.
సాధారణంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం సరిపోతుంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ బిల్లుని అయినా మండలి తిరస్కరించినా.. చర్చించకుండా వదిలేసినా కూడా నెలరోజుల తర్వాత “డీమ్డ్ టు బీ పాస్ డ్” గా భావించి మండలి ఆమోదం పొందినట్లుగా సభాపతి పరిగణించి.. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. అయితే… బిల్లులోని కొన్ని అంశాలు కేంద్రం చట్టంతో ముడిపడి ఉండటంవల్ల రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో… టెన్షన్ లో ఉన్నారు ఏపీ వాసులు!!
గవర్నర్ దగ్గరే అంతా అయిపోతుంది అని భావించిన క్రమంలో… అదికాస్తా హస్తినకు పోయి రావాలి అనేసరికి ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తున్నారంట. ఈ బిల్లులు పాసవ్వాలని.. జగన్ కల నెరవేరాలని.. అభివృద్ధి వికేంద్రీకరణకు అతితక్కువ సమయంలో సహకరించే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు.. హస్తినలో కూడా ఆమోదం పొందాలని పూజలు చేస్తున్నారంట!!