మిరియాల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

మనదేశంలో మిరియాలను ఎక్కువగా పండిస్తున్నారు.. ఇది తీగ జాతికి చెందిన మొక్కలు..బాగా ఎండిన మిరియాలను నల్ల మిరియాలను, పైన పొట్టు తీసిన వాటిని తెల్ల మిరియాలు అంటారు..ఆంధ్రప్రదేశ్లోని విశాఖజిల్లాలో పర్వత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాల్లో దీనిని సాగుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60,500 ఎక రాల్లో దీనిని సాగుచేస్తున్నారు.. ఇక పాడేరు కాఫీతోటల్లో దీన్ని అంతర్ పంటగా వేస్తున్నారు. ఇది వర్షధార పంట..పంటకు అనుకూల పరిస్థితులు.. సముద్రమట్టం నుంచి 500 – 1500 మీ. ఎత్తులో ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలం.1250-2000 మి.మీ. వర్షపాతం, 10-35 డిగ్రీల సెం. గ్రే. ఉష్ణోగ్రత ఉండాలి. నీరు ఇంకిపోయే ఎర్రనేలలు, లేటరైట్ నేలలు మిరియాల సాగుకు మంచిది..

అనువైన రకాలు.. పన్నియుర్- 1 ఎకరాకు 500 కిలోల ఎండు మిరియాల దిగుబడివస్తుంది. దీని ఆకులు వెడల్పుగా, కాయలు గుత్తులు పొడవుగా ఉంటాయి. ఒక్కో గుత్తిలో 125 గింజలుంటాయి. ఇది నీడను తట్టుకోలేదు. పైటోఫ్తోరా వంటి కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. తాజా మిరియాల నుంచి 35 శాతం ఎండు మిరియాలు వస్తాయి..
పన్నియుర్-2 ఎకరాకు 1000 కిలోల దిగుబడినిస్తుంది. కాయల గుత్తులు సుమారు 12 సెం.మీ. పొడవుంటాయి. ఒక్కో గుత్తికి 45 గింజలుంటాయి.తాజా మిరియాల నుంచి 35 శాతం మిరియాలు వస్తాయి.. అలాగే పనియర్ 3 కూడా 800 కిలోల దిగుబడిని అందిస్తుంది.

మిరియాల తీగ అడుగుభాగం నుంచి సమాంతరంగా పెరిగే రన్నర్ కొమ్మలను 2-3 కణుపులున్న చిన్న కొమ్మలుగా కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి- ఏప్రిల్ నెలల్లో తీసుకొని నారుమడిలో లేదా పాలి దీన్ సంచిలో నాటాలి. తర్వాత జూన్-జులైలో తోటలో నాటుకోవాలి. మిరి యాల తీగలు వేయడానికి మూడేళ్ల ముందు సిల్వర్క్ మొక్కలను 2.5-2.5 మీ. ఎడంలో నాటాలి. సిల్వర్క్ మొక్కల మొదళ్ళ వద్ద ఉత్తరదిశగా 50-50-50 పరి మాణమున్న గుంతలు తవ్వి మిరియాల తీగలను . నాటాలి. ఎకరాకు సుమారు 640 మొక్కలు అవసరం నాలుగేళ్లు ఆపైన వయస్సు. మిరియాల పంటలో ప్రతి తీగకు 10కిలోల పశువుల ఎరువు, 100గ్రా. నత్రజని, 40గ్రా. భాస్వరం, 140గ్రా పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. వీటిని సంవత్సరంలో రెండు దఫాలుగా అంటే మే నెలలో సగభాగం, మిగిలిన సగభాగం ఆగస్టు నుంచి సెప్టెంబరులో వేయాలి.. ఎండా కాలంలో ఎండిన ఆకులతో వేర్లను కప్పాలి.. ఫిబ్రవరి- ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి. కాపునిచ్చిన పక్క తీగలను ఒకటి ఉంచి రెండు ఆకులతో 3 కణుపులు ఉండేలా కత్తిరించాలి.. ఇలా చెయ్యడం వల్ల తీగ లాగా కాకుండా గుబురుగా వచ్చి మంచి దిగుబడిని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version