జనసేనకు హ్యాండ్..టీడీపీలోకి రాజేష్ మహాసేన..రచ్చ స్టార్ట్!

-

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. అయితే ఈ పొత్తు వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని, అందుకే ఆ రెండు పార్టీల పొత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు ఉంటాయని..అలాగే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ఎత్తులు ఉంటాయని…కాబట్టి టి‌డి‌పి-జనసేన శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచనలు వస్తున్న విషయం తెలిసిందే.

ఏదో రకంగా కమ్మ-కాపు కులాల మధ్య గొడవ పెట్టడం..టి‌డి‌పి-జనసేనల మధ్య దూరం పెరిగేలా చేస్తారని, కాబట్టి టి‌డి‌పి-జనసేన శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని సలహాలు వచ్చాయి. ఎన్ని వచ్చిన గాని ఏదో రకంగా టి‌డి‌పి-జనసేనల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు చెలరేగేలా చేస్తున్నారు. ఇలా జరుగుతున్న తరుణంలోనే రాజేష్ మహాసేన తీసుకున్న నిర్ణయం..మరోసారి ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచినట్లు కనిపిస్తోంది. దళిత వర్గానికి ప్రతినిధి అన్నట్లు ముందుకెళుతున్న రాజేష్..గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీకి దూరమయ్యారు.

దళితులకు వైసీపీ అన్యాయం చేస్తుందని పోరాటం మొదలుపెట్టారు. అలాగే టి‌డి‌పి-జనసేనలకు అనుకూలంగా నడుస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య ఆయన జనసేన వైపుకు వెళ్లారు. జై మహాసేన, జై జనసేన అంటూ ముందుకెళుతున్నారు. కానీ జనసేన మాత్రం రాజేష్‌ని పెద్దగా పట్టించుకోలేదు..పార్టీలో జరిగే కీలక సమావేశాలకు ఆహ్వానించలేదని, ఒకవేళ జనసేన తమని పార్టిలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేదని చెబుతూ..రాజేష్ మహాసేన తన టీంతో కలిసి టి‌డి‌పిలో చేరడానికి రెడీ అయ్యారు.

తాజాగా యనమల రామకృష్ణుడు ఆఫీసుకు వెళ్ళి..అక్కడ టి‌డి‌పి నేతలతో భేటీ అయ్యారు. ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరనున్నారు. 15, 16, 17 తేదీల్లో బాబు..తూర్పు గోదావరి పర్యటన ఉంది. అప్పుడు రాజేష్ మహాసేన టి‌డి‌పిలో చేరుతున్నారు. ఇలా రాజేష్ టి‌డి‌పిలో చేరడంపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. పట్టుమని 3 నెలలు కూడా పార్టీలో ఉండలేకపోయారని..మీలాంటి వారు జనసేనకు అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలనేది రాజేష్ నిర్ణయమని, కాబట్టి అతనిపై విమర్శలు చేయవద్దని నాగబాబు..జనసేన శ్రేణులకు సూచించారు. అయినా సరే రాజేష్ మహాసేన నిర్ణయం..ఇప్పుడు టి‌డి‌పి-జనసేనల మధ్య ఇంకా గ్యాప్ పెంచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version