గర్భిణీ స్త్రీలకి గుండెల్లో మంట తగ్గించాలంటే ఈ ఇంటి చిట్కాలని చూడాల్సిందే..!

-

స్త్రీ జీవితంలో గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం అయినది. చాలా అందంగా మరియు కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తుంది. ఆ తొమ్మిది నెలలు భావోద్వేగ మరియు హార్మోన్ల మార్పులతో పాటు, గర్భిణీ స్త్రీకి అనేక శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. వీటితో పటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు. ఇది గర్భిణీ స్త్రీలలో 17 శాతం నుండి 45 శాతం మధ్య ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.

ఒకవేళ ఇలా గుండెల్లో మంట కనుక వస్తే ఇంట్లో ఎటువంటి చిట్కాలు పాటించాలి..? ఈ విషయం లోకి వస్తే…. మొదటగా నిమ్మకాయతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని వైద్యులు మరియు స్త్రీ జననేంద్రియ నిపుణులు పేర్కొన్నారు. గుండెల్లో మంట కలిగియేటప్పుడు నిమ్మకాయ రసం తీసుకుంటే అసిడిక్ రిఫ్లెక్షన్ ను నియంత్రించే ఆల్కలీన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇలా గుండెల్లో మంట తగ్గి ఉపశమనం ఇస్తుంది. కనుక ఇది చేయవచ్చు.

నిమ్మ మాత్రమే కాదు అల్లం కూడా మంచి ఔషధంలాగ పని చేస్తుంది. ఇది ఒక టానిక్‌గా పనిచేస్తూ, కడుపు మరియు జీర్ణక్రియతో అనుసంధానించబడిన వ్యాధులకు చికిత్స కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు . గర్భిణీ స్త్రీ అల్లంను కొంచెం వేడి నీటి లో వేసి ఉడికించి అలా చేసిన ఆ అల్లం టీని త్రాగవచ్చు. అలా తాగలేకపోతే కొంచెం చక్కెర వేసుకుని తీసుకోవచ్చు. ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో గుండెల్లో మంటను తగ్గించడానికి బాదం కూడా సహాయం చేస్తుంది. ప్రతి భోజనం తర్వాత కొన్ని బాదంని తింటే కడుపులోని రసాలను తటస్తం చేయడంలో సహాయపడుతుంది, ఇది గుండెల్లో మంటను తగ్గించవచ్చు లేదా నివారించవచ్చు. చూసారా ఎంత సులువుగా ఈ బాధ నుండి బయటపడొచ్చో..!

Read more RELATED
Recommended to you

Latest news