కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? ఐతే మీ డైట్ లో ఇవి చేర్చుకోండి.

-

కొత్త సంవత్సరం వచ్చేసింది. కరోనా భయం వల్ల 2020ఎలా పూర్తయిందో తెలియనే లేదు. ప్రస్తుతం 2021కి వచ్చేసాం. సంవత్సరం మారితే ఏమీ మారదు, క్యాలెండర్ మాత్రమే మారుతుందని ఎంత మంది చెబుతున్నా, ఏమో కొత్త అనగానే అదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంలోనే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాలు ఎన్ని రోజులు పాటిస్తారనేది పక్కన పెడితే కొత్త సంవత్సరం అన్న కారణంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మంచిదే!

ముందుగా కొత్త సంవత్సరం తీసుకునే నిర్ణయాల్లో బరువు తగ్గడం ఒకటి. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చిన కారణంగా తీసుకునే రిజల్యూషన్స్ లో ఎక్కువ మంది తీసుకునే నిర్ణయం బరువు తగ్గాలనే. దానికోసం తమ డైట్ మార్చుకుంటారు. అలా మార్చుకోవాలని అనుకున్న వారికి తమ డైట్ లో ఏమేం ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్డు

రోజుకి ఒక గుడ్డు తినడం మంచిదని చెబుతుంటారు. పొద్దున్న లేవగానే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డుని ఆహారంగా తీసుకోవడం మంచిది. దీనిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.

పసుపు

భారత దేశ వంటకాల్లో పసుపు స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజువారి ఆహారంలో పసుపుని తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటుంది.

గ్రీన్ టీ

టీ తాగితే చక్కెర శాతం పెరుగుతుందని చెబుతుంటారు. కానీ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మందికి తెలుసు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మంచి మేలుని కలిగిస్తాయి. కొవ్వుని కరిగించడంలో గ్రీన్ టీ కీలక పాత్ర పొషిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version