భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది శీతకాల విడిది పర్యటన రద్దు అయింది. కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతన్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన రద్దు అయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది పర్యటన రద్దు అయిందని అధికార వర్గాలు సమాచారం ఇచ్చాయి. కాగ ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది పర్యటన హైదరాబాద్ వచ్చేవాడు.
కానీ తాజా నిర్ణయంతో రాష్ట్రపతి పర్యటన రద్దు అయింది. కాగ గత ఏడాది కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది రాలేక పోయారు. ప్రస్తుతం కూడా కరోనా కు తోడుగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి రాష్ట్రపతి దక్షిణాది శీతకాల విడిదతి పర్యటన రద్దు అయింది. కగ రాష్ట్రపతులు ప్రతి ఏడాది శీతకాలంలో హైదరాబాద్ లోని బొల్లరంలో గల రాష్ట్రపతి భవన్ కు వచ్చి ఉంటారు. అంతే కాకుండా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తారు. కానీ కరోనా కారణంగా అది జరగడం లేదు.