మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కోరారు. అలాగూడెడ్‌లైన్ లోపు ఎన్సీపీ స్పందించకపోతే రాష్ట్రపతి పాలనకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ సిఫారసు చేస్తారనే ప్రచారం జరుగింది. అయితే ప్రచారం జరిగినట్టుగానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. మరియు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు.
అందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఓకే చెప్పారు. దీంతో మహారాష్ట్ర తాజాగా రాష్ట్రపతి పాలన కిందికి వెళ్లినట్టయింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన సమయం ఇవ్వలేదంటూ శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తంమీద రాష్ట్రపతి పాలనతో రెండు వారాలు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది.