అక్కడ పెట్రోల్‌ రూ.70.. క్యూ కడుతున్న జనం

-

దేశంలో పెట్రోల్‌ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో అందరూ ఆ దేశానికి క్యూ కడుతున్నారు. ఎందుకంటే అక్కడ పెట్రోల్‌ లీటరు ధర కేవలం రూ.70, డీజిల్‌ రూ.59 మాత్రమే. అది ఎక్కడ అంటారా? అదేనండి మన పొరుగు దేశం నేపాల్‌. అక్కడ ధరలు తక్కువగా ఉండటంతో సరిహద్దు ప్రాంతంలో ఉండే మనవారు అక్కడికే వెళ్లి పెట్రోలు కొంటున్నారు. దీనివల్ల ఒక విధాంగా స్మగ్లింగ్‌ కూడా చేస్తున్నారు. మరి కొంత మంది ఖాళీ వాహనాలను తీసుకెళ్లి ఫుల్‌ట్యాంకు కొట్టించుకుంటున్నారట. మరి సామాన్య జనం డబ్బులు వెచ్చించ లేక అల్లాడుతున్నారు. బంగారం రోజుకో రేటు మారుతున్నట్లు.. పెట్రోల్‌ ధరలు కూడా రోజుకో రేటు మారుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని దుస్థితి.

అవును మరి మనదేశంలో పెట్రోల్‌ రూ. 100 దగ్గరలో ఉంది. డీజిల్‌ రూ.90 వద్ద ఉంది. ఇది ప్రతి వాహనదారుడిపై తీవ్రప్రభావం చూపుతోంది. నేపాల్‌ కరెన్సీ భారత రూపాయితో పోల్చుకుంటే పెట్రోల్‌ ధర మనకు లీటరు రూ.70, డీజిల్‌ రూ.59 కే వస్తుంది. అంటే లీటరుకు రూ.30 వ్యత్యాసం ఉంది. ఎంత డబ్బు ఆదా అవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే సరిహద్దు ప్రాంతంలో ఉండే వారి పంట పండింది.

ఈ విషయం నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వారికి తెలిసింది. దీంతో నేపాల్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తెచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో తనిఖీ నిర్వహిస్తోంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటోంది. కొంత మంది వారి వాహనాల్లో పెట్రోట్, డీజిల్‌ లేకుండా వెళ్లి ఫుల్‌ ట్యాంకు కొట్టించుకోని మళ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నారని అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ఒక నేపాల్‌ రూపీ మన కరెన్సీలో 62 పైసలకు సమానం.

Read more RELATED
Recommended to you

Latest news