రాజకీయాల్లో మార్పునకు కారణం ప్రధాని మోడీనే అన్నారు మల్కాజ్ గిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్. తాజాగా ఏ. ఎస్. రావ్ నగర్‌లో ఫోరం ఫర్ ఇంప్రూవింగ్ థింగ్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు ఈటల రాజేందర్. మోదీ గారికి ఎందుకు ఓటు వేయాలని డిబేట్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. నేను చిన్నతనంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాలను చూస్తున్నాను. ఎప్పుడూ సంకీర్ణ రాజకీయాలే ఉండేవి.
నేడు రాజకీయాలలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ వంటి వారు కూడా ప్రధాని మోదీని బలపరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్‌కు ప్రధాని మోదీని విమర్శించడానికి ఏడేళ్లు పట్టింది. కానీ రేవంత్ రెడ్డికి మూడు నెలలు మాత్రమే పట్టింది. ప్రధాని మోదీని విమర్శించిన వారి గతేమయ్యిందో మనకు తెలుసు.
ప్రధాని మోదీ మామూలు వ్యక్తి కాదు. అతడు ఒక శక్తి. ఎన్నాళ్లుగానో పేరుపొందిన బీజేపీ పార్టీలో సీటు సంపాదించడమే కాదు. మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడే గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మోదీ. గుజరాత్ మోడల్‌లో దేశాన్ని అభివృద్ధి చేయాలని బీజేపీ అధిష్టానం ఆయనను అభ్యర్థిస్తే దేశ రాజకీయాలలో కాలు పెట్టారు. ఇక్కడా అదే విచిత్రం మొదటి సారి ఎంపీగా గెలుస్తూనే ప్రధాని పదవిని అలంకరించారు.
బీజేపీ పార్టీ 273 సీట్లు 2014లో సాధించింది. అంతేకాదు 2019లో మరోసారి ప్రధానిగా 300 పై చిలుకు సీట్లు సాధించారు. యధారాజా తథా ప్రజా అన్నట్లు ప్రజలందరూ కూడా ఎలాంటి అవినీతి లేకుండా నిజాయితీగా ఓట్లు వేసి, వారసత్వరాజకీయాలను తరిమి కోట్టారు. మోదీ ఏనాడూ అమలు కాని హామీలు ఇవ్వలేదు. సముద్రగర్భంలో పుట్టిన కెరటాలు తీరాన్ని ఎలా తాకుతాయో, ప్రజాగర్భంలో పుట్టిన నినాదం అబ్ కీబార్ మోదీ సర్కార్.ఒకప్పుడు గొప్ప దేశంగా విలసిల్లిన భారత్‌ను మళ్లీ విశ్వగురు స్థానంలో నిలబెట్టారు ప్రధాని మోదీ. మూడవ ప్రపంచ దేశంగా ఉండే భారత్‌ను నేడు ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టారు ప్రధాని మోదీ.
నరేంద్రమోదీకి ఎందుకు ఓటు వేయాలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి చెప్తారు. జీ-20 సమావేశాల తర్వాత భారతదేశం ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకోవడంలో మోదీ పాత్ర ఎంతో ఉంది. అమెరికా పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడితే అమెరికా సెనెటర్లు లేచి చప్పట్లు కొట్టడం మనకు తెలుసు. నాయకునికి సమాజం పట్లు, ప్రజల పట్ల, దేశం పట్ల ఎంత కమిట్‌మెంట్ ఉందనేది మోదీని చూస్తే తెలుస్తుంది. ఆయన ఒకటే చెప్తారు. బతికితే మీకోసం బ్రతుకుతా, చనిపోతే మీకోసం చనిపోతా అంటారు ప్రధాని మోడీ.
భారత్ నేడు ఇతర దేశాలు కన్నెత్తి చూడలేని పరిస్థిలో ఉంది. గతంలో ప్రతీ వస్తువూ ఇది ఇంపోర్టెడ్ అని గొప్పగా చెప్పుకునే వస్తువులు నేడు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. నేడు దేశంలోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. ఎయిమ్స్ ఆసుపత్రులు గతలో 3 మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడి 17కు చేరాయి. మన సంస్కృతికి, సంప్రదాయాలకు ముప్పు తెచ్చే అంశాలను పక్కకి నెట్టి, దేశాభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేద్దాం. మోదీ గారిని గెలిపించుకుంటే మన దేశం ఇంకెంతో అభివృద్ధి చెందుతుంది.
అచ్చమైన తెలంగాణ బిడ్డనైన నన్ను ఇతర పార్టీల వారు ఎక్కడ నుండి వచ్చావని అడుగుతున్నారు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వారు. నేను పక్కా లోకల్. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. నన్నుమల్కాజ్‌గిరి ఎంపీగా, మోదీని ప్రధానిగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.