రేషన్ షాప్ ముందు ప్రధాని మోడీ ఫోటో.. నిర్మల సీతారామన్ కారణామా !

-

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించిన సంగతి తెలిసిందే. బాన్సువాడ నియోజకవర్గం లోని బిక్నూరులో రేషన్ షాపును మంత్రి నిర్మల సీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని.. అలాంటప్పుడు ప్రధాని ఫోటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు.

రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటో పెట్టాలని.. లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబుపేట గ్రామంలో రేషన్ షాప్ ముందు మోడీ ఫోటో దర్శనమిచ్చింది. దుకాణం ముందు ప్రధాని మోడీ ఫోటో పెట్టాడు రేషన్ డీలర్. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడంతోనే మోడీ ఫోటో పెట్టానని రేషన్ డీలర్ చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version