దేశ ప్రధాని ఇవాళ ఉత్తరాఖండ్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. అన్ని మఠాలు, 12 జ్యోతిర్లింగాలు మనల్ని ఆశీర్వదిస్తున్నాయన్నారు. సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు.
కొన్ని అనుభవాల్ని మాటల్లో వ్యక్తీకరించలేమని తెలిపారు ప్రధాని మోడీ. 2013 విధ్వంసం తర్వాత, కేదార్‌నాథ్‌ను తిరిగి అభివృద్ధి చేయవచ్చా అని ప్రజలు ఆలోచించారని.. కానీ కేదార్నాథ్ మళ్లీ అభివృద్ధి చెందుతుందని తనలోని ఒక స్వరం ఎప్పుడూ చెబుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాను ఢిల్లీ నుండి కేదార్‌నాథ్‌లో పునరాభివృద్ధి పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని తెలిపారు. డ్రోన్ ఫుటేజీ ద్వారా ఇక్కడ జరుగుతున్న వివిధ పనుల పురోగతిని తాను సమీక్షించానని పేర్కొన్నారు. కేధార్ నాథ్ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు.