ఈ పథకానికి అప్లయి చేసుకోవాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. కనీసం 8వ తరగతి పాసై ఉండాలి. ఇదివరకు ఏవైనా కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందని వాళ్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్ధి పొందని వాళ్లే ఈ పథకానికి అర్హులు.
PMEGP.. Prime Ministers Employment Generation Programme… పేరు విన్నారా ఎప్పుడైనా? ఇది నిరుద్యోగులకు వరం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు కూర్చొని చదివినా ఉద్యోగం రాక.. బాధలు పడకుండా.. నిరుద్యోగ యువతను ఆదుకునే బ్రహ్మాండమైన పథకం.
మీకు గుర్తుందో లేదో.. 2008లో ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన అనే పథకాలు వచ్చాయి. వాటిని కలిపి తీసుకొచ్చిందే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం. ఈ పథకానికి గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులు. సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే యువతకు ఈ పథకం ద్వారా ఏదైనా ఉత్పత్తి పరిశ్రమ అయితే.. దానికి గరిష్టంగా 25 లక్షల వరకు రుణం, సేవా పరిశ్రమ అయితే 10 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకం పర్యవేక్షణ చిన్న, సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది.
ఈ పథకానికి అప్లయి చేసుకోవాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలి. కనీసం 8వ తరగతి పాసై ఉండాలి. ఇదివరకు ఏవైనా కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందని వాళ్లు, స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్ధి పొందని వాళ్లే ఈ పథకానికి అర్హులు.కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వచ్చే యువతకు ఇది మంచి అవకాశం. పెట్టుబడిలో 10 శాతాన్ని లబ్ధిదారుడే భరించాలి. మిగితా 90 శాతం రుణం బ్యాంకు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, రిటైర్డ్ సైనికులు మాత్రం 5 శాతమే భరించాల్సి ఉంటుంది.
రుణం మంజూరు తర్వాత లబ్ధిదారులు మినిస్ట్రీ నిర్వహించే ఈడీపీ ట్రైనింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పథకానికి అప్లయి చేసుకోవాలనుకునే వాళ్లు www.kviconline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లయి చేసుకోవచ్చు. ఫాం నింపిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక జిల్లా స్థాయిలో ఉంటుంది. టాస్క్‌ఫోర్స్ కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వాళ్లకు కమిటీ నుంచి సమాచారం వెళ్తుంది. అప్పుడు కమిటీకి వాళ్లు ఏర్పాటు చేసే ఇండస్ట్రీకి సంబంధించిన డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. అన్నీ ఓకే అయితే.. మీకు రుణం మంజూరు అయినట్టే.