భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్ దివాళా తీసిన విషయం అందరికి తీసింది. దీని పరిస్థితి రోొజురోజుకీ దిగజారడంతో ఆర్బీఐ దీనిపై మారటోరియం విధించింది. దేశంలోని చాలా బ్యాంకులు ఇప్పుడు యస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాళా తీసిన యస్ బ్యాంక్ లో పెట్టుబడి పెట్టేందుకు వివిధ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ 49% పెట్టుబడి పెట్టేందుకు సిద్దమైంది. ఇప్పుడు దేశం లో మరో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా దివాళా తీసిని యస్ బ్యాంక్ ను ఆదుకోవడానికి సిద్దమైంది. యస్ బ్యాంకులో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు అంగీకరించింది.
దీనితో పాటు తాము కూడా ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి పెడతామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. రూ.600 కోట్లను యస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు తమ బోర్డు అంగీకారం తెలిపిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీనికి తోడు కోటక్ మహీంద్రా బ్యాంక్ 50 కోట్ల షేర్లు కొనుగోలుకు రూ.500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. వీటితో పాటు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సైతం మరో రూ.500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.