దేశంలో చాప కింద నీరులా నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలూ ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనా అనుమానితుల రక్త నమూనాలను పరీక్షించేందుకు గాను అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా టెస్టు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడానికి, వారికి అవసరమైన సమాచారం అందించడానికి అన్ని రాష్ట్రాల్లోనూ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఆ నంబర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీ – 011-23978046, 011-22307145
ఆంధ్రప్రదేశ్ – 0866-2410978
అరుణాచల్ ప్రదేశ్ – 9436055743
అసోం – 6913347770
ఛత్తీస్‌గఢ్ – 07712235091
హర్యానా – 8558893911
జమ్మూ – 01912520982
కశ్మీర్ – 01942440283
కేరళ – 04712552056
లడఖ్ – 01982256462
మధ్యప్రదేశ్ – 0755-2527177
మహారాష్ట్ర – 020-26127394
నాగాలాండ్ – 7005539653
ఒడిశా – 9439994859
రాజస్థాన్ – 01412225624
తమిళనాడు – 04429510500
త్రిపుర – 03812315879
ఉత్తరప్రదేశ్ – 18001805145
పశ్చిమబెంగాల్ – 3323412600
అండమాన్ & నికోబార్ దీవులు – 03192232102
ఇక బీహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డమాన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రజలు 104కు ఫోన్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే మేఘాలయ వాసులు 108 కు, మిజోరం వాసులు 102 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్సైట్లోనూ ఉంచారు. ఆ సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు.