ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెల్స్ యాజమాన్యాలు ధర్నా.. ఎందుకో తెలుసా..?

-

ఇటీవలే హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్యాబ్ ల నిర్వాహకులు అందరు ధర్నా బాట పట్టారు. కరోనా సంక్షోభం సమయంలో పన్నులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్యాబ్ ల నిర్వాహకులు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన బస్సు క్యాబ్ ల నిర్వాహకులు.. తమ నుండి వసూలు చేస్తున్న పన్ను రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా బస్సులు క్యాబ్లు తిరుగక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాము అంటూ తెలిపిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు… ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తమ నుంచి పన్నులు వసూలు చేయడం తగదు అంటూ తెలిపారు.

ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన వారు… తమ వద్ద నుంచి వసూలు చేసే పన్నులను రద్దు చేయాలి అంటూ అధికారులను డిమాండ్ చేశారు. ప్రస్తుత కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తమ పరిస్థితిని అర్థం చేసుకుని… ప్రభుత్వం వెంటనే క్వాటర్లి టాక్స్ లను రద్దుచేసి… తమకు ఊరట కలిగించాలని అంటూ డిమాండ్ చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్యాబ్ యాజమాన్యాలు. ఇక ఆర్టిఏ కార్యాలయం ముట్టడించడం తో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news