సర్జికల్ దాడులపై దురుసుగా మాట్లాడిన పాక్ యువతి.. నోరుమూయించిన ప్రియాంకా చోప్రా..!

646

ఓ యువతి నటి ప్రియాంక చోప్రాతో.. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన పరిణామాలపై తీవ్రంగా మాట్లాడింది. అయితే ప్రియాంకా చోప్రా ఆ యువతితో మాట్లాడి ఆమెకు దీటుగా సమాధానం ఇస్తూనే గట్టిగా బుద్ధి చెప్పి, ఆమె నోరు మూయించింది.

పాకిస్థానీయులు ఎక్కడికి వెళ్లినా భారత్‌పై, భారతీయులపై తమ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ఇప్పటికే భారత్‌పై తమకున్న అసూయను బయట పెట్టుకున్న అనేక మంది పాక్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తులు.. అనేక సార్లు భారతీయులతో పెట్టుకుని భంగపడ్డారు కూడా. సరిగ్గా ఇలాగే ఓ యువతి కూడా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతో మాట్లాడుతూ ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన పరిణామాలపై తీవ్రంగా మండిపడింది. అయితే ప్రియాంకా చోప్రా ఆ యువతితో మాట్లాడి ఆమెకు దీటుగా సమాధానం ఇస్తూనే గట్టిగా బుద్ధి చెప్పి, ఆమె నోరు మూయించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

priyanka chopra shuts pakisthan woman mouth

శనివారం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో బ్యూటీకాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలతోపాటు గ్లోబల్‌స్టార్ ప్రియాంకా చోప్రా కూడా హాజరైంది. అందులో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రియాంకా సమాధానాలు చెప్పింది. ఇక కార్యక్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి ప్రియాంకా చోప్రాను టార్గెట్ చేసి ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన పరిణామాలతోపాటు, గతంలో భారత్ పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ దాడులపై ప్రియాంకాను ప్రశ్నించింది.

కార్యక్రమంలో మాట్లాడిన ఆ పాకిస్థాన్ యువతి.. భారత బలగాలు పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రయిక్ చేసినప్పుడు మీరు జై హింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్‌గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు చేయవచ్చా ? ఓ పాకిస్థానీ మహిళగా నేను, నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం… అయితే మీరు మాత్రం పాకిస్థాన్‌పై యుద్ధానికి దారి తీసేలా అలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం.. అని ఆ యువతి ప్రియాంకాను కాస్త దురుసుగానే ప్రశ్నించింది.

అయితే ప్రియాంకా చోప్రా ఇందుకు గట్టిగానే జవాబిచ్చింది. తనకు పాకిస్థాన్‌లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారని, కానీ తాను ఓ భారతీయురాలినని, తనకు తన దేశం పట్ల బాధ్యత, గౌరవం ఉన్నాయని ప్రియాంకా చెప్పింది. అలాగే తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, ఆ యువతి ఆమె దేశం కోసం తనను ప్రశ్నిస్తుందని, తాను కూడా అలాగే వ్యవహరించానని, ఇలా అరిచి పరువు తీసుకోవద్దని.. ప్రియాంకా ఆ పాక్ యువతికి దీటుగా జవాబిచ్చి ఆమె నోరు మూయించింది. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ప్రియాంకాకు మద్దతుగా నిలిచి ఆమె చెప్పిన జవాబుకు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. అంతే మరి.. అనవసర విషయాలను గెలికితే పాకిస్థాన్‌కు, ఆ దేశవాసులకు, ఎవరికైనా సరే.. ఇలాగే జవాబు చెప్పాల్సి వస్తుంది.. అంతేకదా..!