పవన్ ఆ విధంగా ముందుకు..?? మునుగుతాడో..?? తేలుతాడో..??

కొత్తా దేవుడండీ బాబు కొత్తా దేవుడండీ..అనే పాత సినిమా పాట ఒకటి ఉంది. ఎంత మందికి తెలుసో లేదో గాని దాని అర్థం ఏమిటంటే రోజుకో మాట, పూటకో వేషం వేస్తూ, ప్రదేశాలు మార్చుతూ తిరిగే వాళ్ళని ఇలా సంభోదిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇదే   పాటని ఆపాదిస్తున్నారు ఏపీ ప్రజలు కానీ పాటని కొంచం చేంజ్ చేశారు..పాడిందే పాటర పాచి పళ్ళ దాసరి అంటూ రాగాలు తీస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా సరే అసలు విషయంలోకి వెళ్తే..

పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలు చేసేసమయంలో తనకి ఏది తోస్తే అది మాట్లాడేవారు. రోడ్డు మీద నిలబెడుతా, తోలు తీస్తా, ఆరేస్తా, నాకు తిక్కా ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలని గొర్రెలు చేస్తూ మరీ ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. సరే రాజకీయాల్లో ఇది సహజమే. అయితే ఇదే ఊపులో ఏపీ ప్రజలు ఎంతో కాలం నుంచీ వేచి చూస్తున్న స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఓ వాగ్ధానం చేసేశారు. ఆ రోజు మొదలు కొన్ని రోజుల వరకూ అదే విషయంపై ఆ కమిటీ, ఈ కమిటీ అంటూ జీడి పాకంలా సాగదీసి సాగదీసి వదిలేశారు. తరువాత ఆ ఊసే ఎత్తలేదు. కట్ చేస్తే

ఎన్నికలు అయిపోయాయి, వైసీపీ ఊహించని రీతిలో విజయం సాధించింది. టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక జనసేన పార్టీ సోది లోకి కూడా రాకుండా పోయింది. కానీ ఇక్కడ పవన్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే భవిష్యత్తులో తన పార్టీని నిలబెట్టుకోగలిగే అవకాశం మెండుగా ఉండటం. అందుకే మళ్ళీ పాత పాటని పాడటానికి సిద్దంగా ఉన్నాడట. అదేనండి ప్రత్యేక హోదా. ఇప్పుడు ఇదే అంశంపై భవిష్యత్తు రాజకీయాలు ముడిపడటంతో పవన్  హోదా నినాదంతో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి, సర్వం సిద్దం చేసుకుంటున్నాడట. మరి ఈ సారైనా జనసేనాని సక్సెస్ అవుతాడో లేక యూటర్న్ బాబు గారిలా బోల్తా పడుతాడో వేచి చూడాల్సిందే.