Priyanka Gandhi : వార‌ణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ…..! ప్ర‌తిపాదించిన దీది

-

వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించింది. నిన్న ఇండియా కూట‌మి స‌మావేశ‌మై.. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు , ఉమ్మ‌డి ప్ర‌చారం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీని ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపితే బాగుంటదని చర్చించినట్లు సమాచారం. అయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రియాంక గాంధీనీ వారణాసి నియోజకవర్గము నుంచి మోడీకి పోటీగా నిలబడాలని ప్రతిపాదించిందినట్లు తెలుస్తుంది.

 

గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీని మోడీకి పోటీగా వారణాసి నుంచి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది కానీ కొన్ని కారణాల వల్ల అజయ్ రాయ్ ని మోడీకి పోటీగా బరిలోకి దింపింది. ఇప్పటివరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన దాఖలాలు లేవు. మమత బెనర్జీ ప్రతిపాదనను ఇండియా కూటమి అంగీకరిస్తే… తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news