మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరు ఎందుకు కలుగజేసుకుంటారు. పదేళ్లు ఏదైనా అభివృద్ది చేసి ఉంటే చెప్పాలి. మేము మా సీఎం గారి నాయకత్వంలో పని చేస్తాం. బావా బామ్మర్దులు ఎలా కొట్లాడుకున్నరో మేము చెప్పాలా అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంతకు ముందు హరీశ్ రావు శ్వేతపత్రం గురించి మాట్లాడారు. మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలుగజేసుకొని మాట్లాడారు. హరీశ్ రావుకు గంట సమయం ఇచ్చినా సమయం సరిపోలేదు.
అబద్దాలను నిజం అని చెప్పడంలో హరీశ్ రావుకు మేనమామ పోలికలు వచ్చాయి. హరీశ్ రావు ఎన్ని ఏండ్లు కష్టపడినా కేసీఆర్ తరువాత.. కేటీఆర్ సీఎం అవుతాడు. కానీ హరీశ్ రావు కాలేడు. తండ్రి కొడులు వాడుకోవాల్సినంత వాడుకొని వదిలేస్తారు. వెంటనే హరీశ్ రావు నేనేమీ రూ.50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్షుడి పదవీ తీసుకోలేదు. ఇది నేను చెప్పిన మాటలు కాదు.. స్వయంగా రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారని, తన వద్ద వీడియో ఉందని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుగజేసుకొని మాట్లాడారు.