వారి కారణంగా మూడు సార్లు చావు బతుకులు నుండి బయటకొచ్చా: ప్రియాంక సింగ్

-

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత దగ్గర అయింది తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె పలు టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ప్రియాంక ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ ని పంచుకుంటూ ఉంటుంది తాజాగా తన కష్టాల గురించి ఒక యూట్యూబ్ ఛానల్ లో చెప్పింది. అమ్మాయి లక్షణాలు ఉండడంతో అమ్మాయిగా మారాలనుకున్నాను.

అందుకోసం హార్మోన్ థెరపీ చేయించుకున్నాను అని చెప్పింది ఇండస్ట్రీ లోకి వచ్చాక అవకాశాల కోసం ఇలా మారిపోయావని చాలామంది అన్నారని ఇంకొంత నీతో ఉండాలని నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావని అడిగే వారిని ఇండస్ట్రీలో ఎంతోమంది చిన్నచూపు చూశారని ప్రియాంక సింగ్ చెప్పారు. దేనికైనా హద్దు ఉంటుంది అది దాటితే ఓపిక చచ్చిపోతుంది అని చెప్పింది. ఊళ్లో వాళ్ళు చాలా మాటలు అనేవారని వాళ్ళతో పాటుగా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలానే చూసేవారు తట్టుకోలేకపోయాను. ఒకసారి కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను అలా మూడుసార్లు చావాలనుకుని బతికి బయటపడ్డాను అని చెప్పింది ప్రియాంక

Read more RELATED
Recommended to you

Latest news