నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువని రుజువైంది.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ రియాక్షన్

-

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇవాళ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దీనిపై స్పందిస్తూ ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసిందని ఆరోపించారు. ఈ రోజు ఇది కోర్టులో రుజువైందని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం.. పార్లమెంట్ ఆమోదించిన రెండు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, నోట్ల కంటే ఓట్లకే శక్తి ఎక్కువ అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందని రాహుల్ గాంధీ అన్నారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

“చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం.. అన్నదాతలకు పదే పదే అన్యాయం చేస్తోంది. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యేందుకు ఈసీ ప్రతిసారీ నిరాకరిస్తోంది. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నాను. ఓటింగ్‌ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంటే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో ఎందుకింత మొండితనంగా వ్యవహరిస్తోంది.” అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news