SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్. ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు.

అయితే… TBM ముందు భాగంలో దుర్వాసన వస్తోందని చెబుతున్నారు.
దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది. మిషన్‌ను కట్టర్‌తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్. మిషన్ పార్ట్‌లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు. ఈ ప్రక్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది.