ఎన్ఐఐఎస్‌టీలో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. త‌మిళ‌నాడు తిరువ‌నంత‌పురంలోని సీఎస్ఐఆర్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ లో పలు పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

 

ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అయితే ఇవి కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అప్లై చేసుకోవాలంటే ఆన్ లైన్ పద్దతిలో అప్లై చేసుకోవాలి. ఎంపిక విధానం గురించి చూస్తే ప‌రీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

ద‌ర‌ఖాస్త‌కు న‌వంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఈ లోగా అప్లై చేసుకోచ్చు. యూజీసీ నెట్‌+గేట్ అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 31, 000+హెచ్ఆర్ఐ జీతం, నాన్ గేట్ అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.25,000+హెచ్ఆర్ఐ అందిస్తారు. తుది మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు కచ్చితంగా సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్ డిగ్రీతో పాటు టెక్నిక‌ల్ నాలెడ్జ్ అవ‌స‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.niist.res.in/english/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. ముందుగా అధికారి వెబ్‌సైట్ https://www.niist.res.in/english/ ను సంద‌ర్శించాలి.
అప్లికేష‌న్ కోసం http://parecruit.niist.res.in:8080/ లింక్‌పై క్లిక్ చేయండి. పూర్తి వివ‌రాలు న‌మోదు చేసి, అభ్య‌ర్థి విద్యార్హ‌త‌, వ‌య‌సు సంబంధిత సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news