బ్రేకింగ్ : కోహ్లీ కూతురుపై కామెంట్ చేసిన హైదరాబాద్ వాసి అరెస్ట్

-

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ… కూతురుపై సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నగరానికి చెందిన రామ్ నరేశ్ ను ( 23 సంవత్సరాలు ) ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కోహ్లీ కూతురిని రేప్ చేస్తాం అంటూ కామెంట్లు చేసిన కేసు లో భాగంగా రామ్ నరేష్ ను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో రామ్ నరేష్ పని చేస్తున్నాడు. అయితే తాజాగా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు… రామ్ నరేష్ ను అరెస్ట్ చేసి ముంబై కి తీసుకు వెళ్లారు. రేపు ముంబై కోర్టులో రామ్ నరేష్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా గత నెల జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. మ్యాచ్ ఓడిన అనంతరం… విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానంటూ… రామ్ నగేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news