SAMANTHA : “మెంటల్” అంటూ… నాటు నాటు సాంగ్ పై సమంత సంచలన ట్వీట్ !

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం… సోషల్ మీడియాకు.. ఓ అడుగు దూరంలోనే ఉంటుంది హీరోయిన్ సమంత. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం ఇవాళ విడుదల చేసిన… “నాటు నాటు” సాంగ్ పై హీరోయిన్ సమంత కామెంట్ చేసింది.

అంతేకాదు ఈ పాటను షేర్ కూడా చేసింది సమంత. అందుకు సమంతకు కృతజ్ఞత చెబుతూ… ఆర్ ఆర్ ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ టీం దానిని రిపీట్ చేసింది. సమంత కాకుండా ఈ పాటపై.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని చాలా మంది డైరెక్టర్స్, నటీనటులు కూడా కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. నాటు నాటు.. సాంగ్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది ది ఆర్ ఆర్ ఆర్ టీమ్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ఇరగదీసే స్టెప్పులు వేశారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వీరు ఈ పాటలో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news