‘టిల్లూ స్క్వేర్’ నుంచి ‘ఓ మై లిల్లీ’ సాంగ్ ప్రోమో విడుదల

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ విడుదల అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి.

‘టిల్లూ స్క్వేర్’ మూవీ నుంచి మరో పాట ప్రోమో వచ్చింది. ‘ఓ మై లిల్లీ’ అంటూ సాగే ఈ పాటను సిద్ధు, రవి ఆంటోనీ రచించగా.. శ్రీరామ్ చంద్ర ఆలపించారు. హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించే ఈవెంట్ లో ఈ నెల 18న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news