అయోధ్య తీర్పుకు ముందు.. త‌ర్వాత చేయ‌కూడ‌ని ప‌నులు..

-

దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది! అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ తీర్పు నేపథ్యంలో దేశమంతా హైఅలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. కాగా, అయోధ్య తీర్పు నేపథ్యంలో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ పలు సూచనలు చేసింది.

తీర్పుకు ముందు.. అది ఎలా ఉండొచ్చు అని ఊహాజనిత వ్యాఖ్యలు ఉండరాదు. బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తీర్పు తర్వాత.. ఎలాంటి రెచ్చగొట్టే పదాలు కానీ, వ్యాఖ్యలు కానీ చేయకూడదు. తీర్పు తర్వాత నిరసనలు…సంబరాలకు సంబంధించిన వాటిని చూపించకూడదు. తీర్పుని.. తీర్పులా చెప్పాలి తప్ప.. ఉపమానాలు, ఉపమేయాలు వాడకూడదు. తీర్పుపై రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రసారాలు చేయరాదు.మతపరమైన అంశాల ప్రస్తావన విషయంలో.. అత్యంత జాగ్రత్త వహించాలి.తీర్పునకు సంబంధించి.. న్యాయమూర్తులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news