అల్వాల్ అడ్డాగా విదేశీవిద్యార్థినుల‌తో వ్య‌భిచారం..నిర్వాహ‌కుడి అరెస్ట్..!

-

హైద‌రాబాద్ లోని అల్వాల్ అడ్డాగా విదేశీవిద్యార్థినుల‌తో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న నింధితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాంజానియా దేశానికి చెందిన కబాంగిలా వారెన్ అలియాస్ ఆండ్రూస్ నేరెడ్ మెట్ లో నివాసం ఉంటున్నాడు. ఆండ్రూస్ విదేశాల‌కు చెందిన యువ‌తుల‌ను ఉన్న‌త విద్య పేరుతో హైద‌రాబాద్ ర‌ప్పిస్తున్నాడు. ఇక్క‌డ తానే నివాసం క‌ల్పించి ఆదాయం కూడా వ‌చ్చేలా చూస్తాన‌ని చెప్పి వ‌చ్చిన త‌ర‌వాత వ్య‌భిచార రొంపులోకి దింపుతున్నాడు.

గ‌త కొంత‌కాలంగా నింధితుడు వ్యభిచార గృహాన్ని న‌డుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆండ్రూస్ కు ఉన్న ప‌రిచ‌యాల‌తో విటుల‌ను ర‌ప్పిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. రాచ‌కొండ యాంటీ హ్యూమ‌న్ ట్రాఫికింగ్ టీమ్ మరియు నేరెడ్ మెట్ పోలీసులు క‌లిసి నింధితున్ని జూన్ 28న అరెస్ట్ చేశారు. అంతే కాకుండా నింధితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా హైద‌రాబాద్ లో ఈమ‌ధ్య పోలీసులు మెరుపుదాడులు చేస్తూ వ్య‌భిచార గృహాల‌ను లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news