టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటులు… మృతి చెందారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు తాజాగా మరణించారు. ఫిట్స్ కారణంగా ఆయన మృతి చెందినట్టు సమాచారం అందుతోంది.

నిన్న తన సొంత ఊరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయనను అక్కడ మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఏలూరు ఆస్పత్రిలో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం కి ఎస్ రామారావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలో ఉండే కౌలూరు లో ఉంచారు. అక్కడ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. రేపు ఆయన అంత్యక్రియలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేఎస్ నాగేశ్వర రావు మృతి పట్ల.. పలువురు టాలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.