ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పాలనలో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. చార్జ్ తీసుకున్న వెంటనే తన శాఖలకు సంబంధించిన అధికారులతో జనసేనాని వరుస రివ్యూలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, పురపాలక, వైద్యారోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధం, ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పురపాలకశాఖ మంత్రి నారాయణ,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ, నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతపై మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు.