పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజ్ దీప దంకర్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాలోని రాజ్ భవన్ గేటు వద్ద నిరసనలు గత రెండు రోజుల నుంచి జరుగుతుంది. ఒక వ్యక్తి మంగళవారం గొర్రెల మందను తోలుకుని రాజభవన్ ముందుకి వెళ్ళారు. నారద స్టింగ్ టేపుల కేసు దర్యాప్తుకు సంబంధించి మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టిఎంసి ఎమ్మెల్యే మదన్ మిత్రాను సిబిఐ అరెస్టు చేసినందుకు నిరసనగా టిఎంసి కార్యకర్తలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేసారు.
ఒక వ్యక్తి అర డజను గొర్రెలతో రాజ్ భవన్ ఉత్తర ద్వారం వద్ద నిరసనకు దిగాడు. అయితే పోలీసులు అతన్ని మాత్రం అదుపులోకి తీసుకోవడం గాని తనిఖీ చేయడం గాని చేయలేదు. దీనితో ఏం జరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కాలేదు. గవర్నర్ ని అవమానించారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు బిజెపి నేతలు.