ఈట‌ల‌కు మ‌రో దెబ్బ‌.. హ్యాండ్ ఇచ్చిన కీల‌క నేత‌

-

హుజూరాబాద్ రాజ‌కీయాలు అంతు చిక్క‌కుండా త‌యార‌వుతున్నాయి. కొంద‌రు ఈట‌ల వెంట ఉంటే.. మ‌రి కొంద‌రు టీఆర్ ఎస్‌కు జై కొడుతున్నారు. ఎప్పుడు ఎవ‌రు ఎటువైపు దుంకుతారో అర్థం కావ‌ట్లేదు. ఇప్ప‌టికే జ‌మ్మికుంట మున్సిప‌ల్ చైర్మ‌న్ త‌క్కెళ్ల‌ప‌ల్లి రాజేశ్వ‌ర్‌రావు టీఆర్ ఎస్‌కు జై కొడితే.. వైస్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న మాత్రం ఈట‌ల‌కు జిందాబాద్ కొట్టారు.

ఇలా రాజ‌కీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. కొంద‌రు నాయ‌కులు ఒక‌సారి ఈట‌ల‌కు జై కొడితే.. తెల్లారే స‌రికే టీఆర్ ఎస్ జిందాబాద్ అంటున్నారు. ఇప్పుడు మ‌రో దెబ్బ త‌గిలింది ఈట‌ల రాజేంద‌ర్‌కు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా, పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్న బండ శ్రీనివాస్ హ్యాండ్ ఇచ్చారు. త‌మ‌కు ఈట‌ల ఏం చేయ‌లేద‌ని, తాము టీఆర్ ఎస్ వెంటే ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఈయ‌నతో పాటు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గంధె రాధిక కూడా టీఆర్ ఎస్ ను వీడేది లేద‌ని చెప్పారు. ఇలా ఒక‌రి వెంట ఒక‌రు ఈట‌ల‌కు షాక్ ఇస్తున్నారు. మ‌రి వీటిని ఈట‌ల ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news