ఒకపక్కన విమర్శలున్నా జగన్ సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కు చెందిన మృత, నిరార్థక ఆస్తులను ఉత్పత్తి ఆధారిత లీజ్ అమౌంట్ గా అమూల్ కు అప్పగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ తో ఏపీ ప్రభుత్వం ఇక్కడి పాల సహకార సంఘాలను పునరూజీవింప చేయాలని చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయమంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ , ఏపీ ప్రభుత్వం తరపున అమూల్ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రత్యేకాధికారి పేరుతో ఆ ఆస్తులను లీజుకిచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. వివిధ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘాలు వద్ద ఉన్న ఆస్తులను నామమాత్రపు లీజుకు అమూల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆస్తులను పునర్జీవింపచేయటానికి, రాష్ట్రంలోని సహకార డెయిరీలను కాపాడేందుకు ఉత్పత్తి ఆధారిత లీజు మొత్తానికి అమూల్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు సెక్రటరీ పూనం మాలకొండయ్య.

Read more RELATED
Recommended to you

Latest news