రష్యాలో కుప్పకూలిన ఆర్మీ విమానం :ముగ్గురు మృతి

-

రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సైన్యానికి సంబంధించిన ఓ కొత్త విమానాన్ని పరీక్షిస్తూ ఉండగా… గాల్లోనే మంటలు చెలరేగి కుప్పకూలింది విమానం. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోలో శివారులో ఈ ఘటన జరిగింది. రష్యా సైన్యానికి చెందిన ఓ కొత్త తేలికపాటి రవాణా విమానాన్ని మాస్కో సమీపంలోని…. కుబింకా ఎయిర్ ఫీల్డ్ లో టెస్ట్ చేశారు.

అయితే ఈ విమానం తిరిగి లాండ్ అవుతుండగా ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు తలెత్తాయి. ఆ మంటల తోనే కాసేపు ప్రయాణించిన ఆ విమానం… ఆ తర్వాత కింద పడిపోయింది. ఇంకా ఈ ఘటనలో విమానంలో ప్రయాణించిన ఇద్దరూ టెస్ట్ పైలెట్లు మరియు ఫ్లైట్ ఇంజనీర్ మృతి చెందారు. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటన ఆ దేశ అధ్యక్షుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news