సీఎం కేసీఆర్ పెద్ద హంతకుడు.. మోసగాడు : షర్మిల ఫైర్

మహబూబాబాద్ జిల్లా : నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన కేసీఆర్ హంతకుడు… మోసగాడని.. కేసీఆర్ ది మాయ మోసాల ప్రభుత్వం, హంతకులు ప్రభుత్వమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. తెలంగాణాలోని నిరుద్యోగుల కోసం గూడూరు మండలం గుండెంగ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష విరమించారు వైయస్ షర్మిల. దీక్ష విరమించిన అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ…
ఉద్యమంలో పోరాటంలో ముందుండి పోరాటం చేసింది యువకులు విద్యార్థులు అని.. తెలంగాణను సాధించింది యువకులు, విద్యార్ధులు అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పరిపాలనను పనికిరాని వారి చేతుల్లో పెట్టామని యువత బాధపడుతుందని… నోటిఫికేషన్ల కోసం యేళ్ల తరబడి వందల మంది నిరుద్యోగులు ఎదురు చూశారని ఆవేదన వీఆఖతం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ కు చలనం లేదని.. ఒక్కసారి ఆలోచన చేయమని కేసీఆర్ ని అడుగుతున్నా ఇవి హత్యలా ? లేక ఆత్మహత్యలా ? అని ప్రశ్నించారు. విద్యార్ధులు, యువత పట్ల కేసీఆర్ దొంగ ప్రేమ నటిస్తున్నాడని… సునిల్ కుటుంబానికి ఉద్యోగం, డబల్ బెడ్ రూం ఇస్తానన్నారు ఏమైంది..? అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారని వారి కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. సునిల్ కుటుంబానికి నిరుద్యోగుడైన సునిల్ అన్నకి ఎప్పుడు ఉద్యోగం ఇస్తారని ప్రశ్నించారు.