తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలు అయింది. ఇటీవల ఆక్సీజన్ అంధక రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్ధికంగా సహాయం చేసింది. ఇక ఇదిలా ఉంటే ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలి అని పిటీషన్ దాఖలు చేసారు.
రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలి అని పిటీషన్ పేర్కొన్నారు. కోవిడ్ బాధితులకు మందులు,ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా రాష్ట్రప్రభుత్వం సకాలంలో అందించాలి అని కోరారు. రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని పిల్ లో పేర్కొన్న పిటిషనర్… రుయా ఆస్పత్రిపై FIR నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు.