హైదరాబాద్ లో పార్టీలకు అనుమతి లేదు…కానీ పబ్బులు ఓపెన్ !

-

నూతన సంవత్సర వేడుకల పై వెస్ట్ జోన్ డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పార్టీలకు ఎలాంటి అనుమతులు లేవన్న ఆయన రోజు మాదిరిగానే పబ్బులు, క్లబ్బులు నడుస్తాయని అన్నారు. అయితే న్యూ ఇయర్ సంధర్భంగా మరో గంట అదనంగా ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. కాబట్టి ఆ సమయం వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే పబ్ లు ఓపెన్ అయ్యే ఉంటుందని కానీ డ్యాన్స్ ఫ్లోర్, డీజే లకు అనుమతి లేదని అన్నారు.

ఎలాంటి ఈవెంట్ లకు అనుమతులు లేవన్న ఆయన నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే అరెస్టు అవుతారని ఆయన పేర్కొన్నారు. తాగని వారు ఎవరైనా ఉంటే వెంట తీసుకొని రావాలని అన్నారు. పబ్ లు, క్లబ్‌ల నిర్వాహకులకు ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. 30 చోట్ల డ్రంకెన్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని, అర్థరాత్రి నుండి తెల్లవారు జాము వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తున్నామని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version