పెళ్లి కాకుండానే తల్లైన పునర్నవి.. నిజాలు ఏంటంటే..?

-

ప్రముఖ హీరోయిన్ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు ఉయ్యాల జంపాల మూవీలో హీరోయిన్ అవికా గోర్ ఫ్రెండ్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలు చేసినా కూడా బ్రేక్ రాలేదు కానీ బిగ్ బాస్ 3లో పార్టిసిపెంట్ గా వెళ్లి కావాల్సినంత ఇమేజ్ సొంతం చేసుకుంది… బుల్లితెర ప్రోగ్రామ్స్, ఒక వెబ్ సిరీస్లో చేసి ఆ తర్వాత లండన్ వెళ్లిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి ఒక సంచలన వార్త తెగ వైరల్ గా మారుతోంది.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఈమధ్య తాను కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలలో ఆమె పొట్ట కాస్త ముందుకు కనిపించడంతో ఈ న్యూస్ కు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలు పునర్నవిని బాగా హార్ట్ చేశాయి. దీంతో కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయింది ఈ ముద్దుగుమ్మ.. ” నా గే బెస్టితో గర్భిణీ అయ్యానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఇది అసత్యం. గత నెలలో కూడా నేను కాస్త అనారోగ్యానికి గురైతే.. ఏకంగా ప్రాణాలు పోతున్నాయని రాశారు.. ఇదొక చెత్త న్యూస్.. ఇప్పుడేమో నేను గర్భిణీ అని ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారు.. నెట్లో చూసి ప్రతి వార్త నమ్మేయకండి.. ఏది నిజమో ఏది అబద్దమో కాస్త తెలుసుకోండి.

ఇలాంటి చెత్త రాతలు అవతల మనిషిని చాలా ఇబ్బంది పెడతాయని ఆలోచించండి ” అంటూ ఆమె కాస్త బలంగానే క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే పునర్నవి ప్రెగ్నెన్సీ పై క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news