కరివేపాకు టీ తో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి..!

-

ఆరోగ్యానికి కరివేపాకు చాలా మంచిది. కరివేపాకులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే ఈ ఆకులతో టీ ను తయారు చేసుకుని తాగడం ఉత్తమం. ఇక వాటి వలన ఎలాంటి లాభాలని పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

కరివేపాకు టీ తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవే.

ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి :

ఫ్రీరాడికల్స్ వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాలను డామేజ్ చేయకుండా కాపాడుతాయి.

డయాబెటిస్ సమస్య తగ్గుతుంది:

కరివేపాకు టీ తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ శాతం కంట్రోల్ అవుతుంది. దాంతో డయాబెటిస్ సమస్యను కూడా దీంతో నియంత్రించవచ్చు.

జీర్ణవ్యవస్థ సమస్యలు వుండవు:

కరివేపాకులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. దాంతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ టీ ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల గ్యాస్ మరియు డయేరియా వంటి సమస్యలు దూరమవుతాయి.

మార్నింగ్ సిక్నెస్ :

గర్భిణీలు మార్నింగ్ సిక్నెస్ ను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కరివేపాకు టీ ను తీసుకోవడం వల్ల వికారం, వాంతులు మరియు మార్నింగ్ సిక్నెస్ వంటివి రాకుండా ఉంటాయి.

ఈ కరివేపాకు టీ ను ఈ విధంగా తయారు చేసుకోండి:

30 నుండి 40 వరకు కరివేపాకులను తీసుకుని ఒక గ్లాస్ మరిగిన నీటిలో వెయ్యండి, కొన్ని గంటల పాటు ఇలానే నీటిలో ఉంచండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి, రుచికి సరిపడా తేనె మరియు నిమ్మ రసాన్ని కలిపి తాగండి. ఈ టీ ను ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపున తాగితే చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news