నిన్న కేజీఎఫ్ హీరోతో సరదాగా గడిపిన పునీత్ రాజ్ కుమార్..ఇంతలోనే ఇలా…!

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సినీ లోకాన్ని విషాదం లోకి నెట్టివేసింది. కాగా నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఈరోజు ఉదయం సడెన్ గా గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడం అంతలోనే మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితమే పునీత్ రాజ్ కుమార్ కన్నడ స్టార్ హీరో యష్ తో కలిసి ఓ స్టేజ్ పై స్టెప్పులు వేశారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన జై భజరంగి 2 సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగింది.

ఈ ఈవెంట్ కు హీరో యష్ మరియు పునీత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద్భంగా పునీత్ రాజ్ కుమార్… శివరాజ్ తోపాటు యష్ తో స్టెప్పులు వేశారు కాగా ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ సడెన్ గా మృతిచెందడంతో స్టేజీపై హీరో యష్ తో కలిసి చేసిన డ్యాన్స్ మరియు ఆయన తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసుకుంటూ పునీత్ రాజ్ కుమార్ ను మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news