నేరస్తులకు వందరోజుల్లోపే శిక్ష విధించేలా రాష్ట్ర హోంశాఖ, కీలక నిర్ణయించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం లో కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత భూమిపూజ చేశారు. అంతేకాదు ప్రీ ప్రైమరీ పోలీస్ రక్షక్ స్కూల్ పోలీస్ క్యాంటీన్ ను ఆమె పరిశీలించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సెల సాసింగ్ పరేడ్ హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పని చేయాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా సేవలు చేయాలన్నారు. ప్రీ ప్రైమరీ పోలీస్ రక్షక్ స్కూల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 397 మంది ట్రైనీ ఎస్సైల్లో 97 మంది మహిళలు ఉండటం గర్వకారణమని హోంమంత్రి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై దృష్టి పెట్టింది. నేరాలు, ఘోరాలను అరికట్టేందుకు నిఘాను పటిష్టం చేసింది. పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీరియస్ యాక్షన్‌కు దిగుతోంది. నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేస్తోంది. ఎంతటి నేరమైనా 100 రోజుల్లో శిక్ష పడేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రి అనిత అనంతపురంలో కీలక ప్రకటన చేసింది. నేరస్తులకు 100 రోజులోపే శిక్షలు పడేలా పని చేయాలని పోలీసులను ఆదేశించారు.