పూరీ జగన్నాథ్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడా ??

-

వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలా పడ్డ పూరి జగన్నాథ్ గత ఏడాది జులై 18 వ తారీఖున తన డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పూరి మార్కెట్ ఒక్కసారిగా పైకి రావటం జరిగింది. సినిమాకి పూరి జగన్నాథ్ నిర్మాత కావడంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. రామ్ కెరీర్లోనే అతిపెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది.

Image result for puri jagannath director"

దాదాపు ఈ సినిమా కోసం తన ఇల్లు మరియు ప్రాపర్టీ మొత్తం అమ్మేసి పెట్టుబడి పెట్టడంతో సినిమా అదిరిపోయే మాస్ హిట్ అవడంతో పూరి జగన్నాథ్ వచ్చిన డబ్బుతో మళ్లీ హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ లో ఓ లగ్జరీ కార్యాలయం కట్టడం జరిగింది. దానికి ‘కేవ్’ అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు పూరి జగన్నాథ్.

 

కాగా ఈ సినిమాలో తనతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలపడంతో పూరి జగన్నాథ్ మరొక కార్యాలయాన్ని ముంబై నగరంలో ప్రస్తుతం కట్టడానికి రెడీ అయ్యారు అంట. దీనికి అడ్డా అని పేరు కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో ఫైటర్ సినిమా ప్యాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేయకముందే విచ్చలవిడిగా డబ్బులు పూరి జగన్నాథ్ కార్యాలయం కోసం ఖర్చు పెట్టడం తో…ఇస్మార్ట్ శంకర్ సినిమా కి పూరి జగన్నాథ్ కి మంచి లాభాలు వచ్చినట్టు ఉన్నవి…డబ్బులు బాగా వేస్ట్ చేస్తున్నాడు అంటూ తాజాగా వచ్చిన ఈ వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు పూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.   

Read more RELATED
Recommended to you

Latest news