గార్జియస్ లుక్ లో పూర్ణ.. ఎంగేజ్మెంట్ వీడియో వైరల్..!!

-

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పూర్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అవును చిత్రాలతో మంచి విజయాలని అందుకోవడమే కాకుండా హాట్ బ్యూటీగా కూడా పేరు పొందింది. ఇక బుల్లితెరపై కూడా పలు షో లలో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ అందరికీ సుపరిచితురాలు అయ్యింది. అయితే తాజాగా గడిచిన కొద్ది నెలల క్రితం ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకోబోతోంది అని, తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టును షేర్ చేసింది. అయితే ఇప్పుడు తన నిశ్చితార్థం దానికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం.

నిన్నటి రోజున హీరోయిన్ పూర్ణ తన కాబోయే భర్త ఆసిఫ్ తో ఎంగేజ్మెంట్ కేరళలో చాలా ఘనంగా జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను తమ అభిమానులతో పంచుకోవడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. పూర్ణ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నేను నా ఎంగేజ్మెంట్ ఫోటోలతో ప్రేమలో పడ్డాను అనే విధంగా తెలియజేసింది. ఇక ఇలాంటి అందమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోను అని తెలియజేస్తోంది. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది పూర్ణ. ఇక పూర్ణ భర్త కూడా ఒక బిజినెస్ మాన్.

హీరోయిన్ పూర్ణ తన కోసమే ఒక ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొని వేసుకున్న డ్రస్సులో ఎంతో అందంగా కనిపిస్తున్నది. ఇక పూర్ణ భర్త ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు సైతం గోల్డెన్ వీసా అందించడంలో ఈయన పాత్ర ఉన్నదని చెప్పవచ్చు. చివరిగా పూర్ణ అఖండ సినిమాలో నటించడం జరిగింది. అయితే వివాహమైన తర్వాత పూర్ణ సినీ ఇండస్ట్రీకి దూరమవుతుంది అని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇక తన భర్త కోరిక మేరకే ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది పూర్ణ. అయితే పూర్ణ ఎంగేజ్మెంట్ కి సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. వాటిని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version