బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన అల్లు అర్జున్…!

-

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా నటించారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా యూట్యూబ్ లో షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. పుష్ప బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు…. తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు జరిగినట్టు సమాచారం.

దాంతో ఇండస్ట్రీలో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల జాబితాలో పుష్ప నాలుగవ స్థానంలో నిలిచిపోయింది. ఇక ఇక ఈ సినిమా కంటే ముందు మూడో స్థానంలో బాహుబలి పార్ట్ 2, రెండో స్థానంలో సాహో, ఒకటో స్థానం లో సైరా నరసింహారెడ్డి ఉన్నాయి. కాగా బాహుబలి పార్ట్ 1 రికార్డును పుష్ప బద్దలు కొట్టింది. విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 17 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news