యూకేలో కరోనా విలయం… రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు…

-

ప్రపంచంలో మరోసారి కరోనా విలయం ప్రారంభమైంది. ఇప్పటికే ఆల్ఫా, డెల్టా వంటి వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలపై దాడి చేసింది. తాజాగా మరోసారి ఓమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. యూకేను కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల ఆ దేశంలో ఓమిక్రాన్ తొలి మరణం కూడా నమోదైంది. దీంతో అక్కడ ఓమిక్రాన్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది.

యూకేలో నిన్న ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 78610 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇన్ని కేసులు ఒకే రోజు నమోదుకావడం ఇదే తొలిసారి అని అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 146791కి చేరింది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ వేరియంట్ కూడా యూకేను వణికిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా యూకేలో ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు యూకేలో 10017 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news