pushpa : ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” సాంగ్‌ రిలీజ్‌.. ఊర మాస్‌ స్టెప్పులతో రెచ్చిపోయిన అల్లు అర్జున్‌

-

ఐకాన్‌ స్టార్‌, ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ పుష్ప. టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ లో హైట్రిక్‌ మూవీ గా పుష్ప తెరకెక్కుతోంది. ఈ సినిమా మైత్ర మూవీ మేకర్స్‌ బ్యానర్ పై తెరకెక్కుతుండగా… అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే టాలీవుడ్ నటుడు సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా పుష్ప సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఫోర్త్‌ సింగిల్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ ఫోర్త్‌ సాంగ్‌ ను తాజాగా విడుదల చేసింది పుష్ప టీం. ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” అంటూ సాగే ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌ లో అల్లు అర్జున్‌ అదర గొట్టాడు. ఊర మాస్‌ స్టెప్పులతో అల్లు అర్జున్‌ రెచ్చిపోయాడు.  ఈ  పాటలో పూర్తి గా మాస్‌ లుక్‌ లోనే కనిపించాడు బన్నీ.  మొత్తానికి ఈ పాట కూడా ఇప్పుడు యూట్యూబ్‌ ను షేక చేస్తోంది.  కాగా.. పుష్ప సినిమా డిసెంబర్‌ 17న వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news