జర్మనీకి పయనమైన పుష్ప రాజ్….. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీకి బయలుదేరాడు. జర్మనీలో జరిగే ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు.

దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనతో ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ గురువారం ఉదయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి.

 

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.దీంతో అల్లు అర్జున్ మరోసారి ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version